స్పీడ్ మీదున్న హీరో  విజయ్ 

12 Apr,2019

తమిళ స్టార్ హీరో  విజయ్ నటిస్తున్న ‘తలపతి 63’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాంతో ఈ చిత్రం యొక్క షూటింగ్ ఇప్పటికే 65 శాతం కంప్లీట్ అయ్యింది. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ 50 రోజుల పాటు జరుగనుంది. ఈషెడ్యూల్ కోసం ఈవీపి స్టూడియోస్ భారీ ఫుట్ బాల్ స్టేడియం సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఆ తరువాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయాన్ని కేటాయించి దీపావళికి ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. అట్లీ డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సూపర్ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు వున్నాయి.

Recent News